వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడినట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాబట్టి రాగల 36 గంటల్లో ఉత్తరాంధ్ర, దక్షిణఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని పేర్కొంది. అలాగే ఎల్లుండి కూడా అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిచే ఛాన్స్ ఉంది. ఇక మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
అయితే ఈ అల్పపీడనం వల్ల రేపు కోస్తాతీరం వెంబడి గంటకు 45 నుండి 65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు అని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు జారీ చేసింది. అదే విధంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదు అని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ప్రజలకు సూచనలు జారీ చేసారు.