తెలంగాణకు 7 , ఏపీకి 8 నవోదయ విద్యాలయాలను ప్రకటించిన కేంద్రం

-

తెలంగాణకు 7 జవహర్ నవోదయ విద్యాలయాలు.. ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలను ప్రకటించింది కేంద్రం. ఇక తెలంగాణలో 7 నూతన జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పత్రికా ప్రకటన చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన నేడు న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో 7 నూతన జవహర్ నవోదయ విద్యాలయా(JNV)లను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు.

navodaya

కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల యావత్ తెలంగాణ ప్రజలతో పాటుగా, వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలలో దాదాపు రూ.340 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ 7 JNV ల ద్వారా మరో 4,000 మంది తెలంగాణ విద్యార్థులకు 6 నుండి 12 వ తరగతి వరకు హాస్టల్ వసతితో సహా అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్య అందనుంది మరియు 330 మందికి కొత్తగా ఉపాధి లభించనుందని తెలిపారు. ఏపీలోని అనకాపల్లి, చిత్తూరులో వలసపల్లె, సత్య సాయి జిల్లాలో పాలసముద్రం, గుంటూరులో తాళ్లపల్లె, రొంపిచర్ల, కృష్ణాలో నూజివీడు, నందిగామ, నంద్యాలలోని డోన్లో KVBల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version