వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం పూర్తి

-

Warangal Multi Super Specialty Hospital  : వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం పూర్తి అయింది. వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో రూ. 1,150 కోట్లతో చేపట్టిన 2 వేల పడకల 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం దాదాపు పూర్తయింది. 2021 జూన్ 21న అప్పటి సీఎం కేసీఆర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

The construction of Warangal Multi Super Specialty Hospital is complete

గత సంవత్సరం దసరా నాటికి పనులు పూర్తిచేసి సేవలు ప్రారంభించాలనుకున్నా నిర్మాణం పూర్తి కాకపోవడంతో సాధ్యపడలేదు. ప్రస్తుతం ఫ్లోరింగ్, టైల్స్ పరచడం, అంతస్తుల మధ్య ప్లంబింగ్, మెడికల్ పరంగా చేపట్టాల్సిన పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆఖరి వరకు ఆసుపత్రిలో అన్ని రకాల పనులు పూర్తిచేసి ఇవ్వాల్సి ఉండటంతో అందుకు అనుగుణంగా నిర్మాణ సంస్థ పనులు కొనసాగిస్తోంది. ప్రస్తుతం నగరంలో ఏ మూల నుంచి చూసిన ఈ ఆసుపత్రి భవనం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news