ఆ కేసులో రేవంత్ రెడ్డికి జులై 14 వరకు డెడ్ లైన్.. ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు

-

ఓటుకు నోటు కేసులో జూలై 14 రేవంత్ రెడ్డికి డెడ్ లైన్ అని, ఇది విని కాంగ్రెస్ వాళ్లు పండగ చేసుకుంటున్నారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. బ్యాగులు మోసిన కేసు దగ్గర పడిందని, ఆ కేసులో జూలై 14 సీఎం రేవంత్ రెడ్డికి డెడ్ లైన్ అని, ఈ వార్త విని జూలై 14 ఎప్పుడు వస్తుందని కాంగ్రెస్ ముఖ్య నాయకులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి లాంటి వాళ్లు పండగ చేసుకుంటున్నారని అన్నారు. ఎస్సీ ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ముట్టేది లేదని, వాటిల్లోనుండి తీసి ముస్లింలకు ఇచ్చేది లేదని, మోడీ బ్రతికున్నంత కాలం ఎవ్వడు కూడా ఈ రిజర్వేషన్లను ముట్టుకోడని స్పష్టం చేశారు.

అలాగే రేవంత్ రెడ్డి ప్రచారానికి పోతే నీ గ్యారెంటీల సంగతి ఏంటని ప్రజలు అడుగుతారని, అందరినీ మభ్యపెట్టడానికే కొత్త పూటకం పెట్టాడని దుయ్యబట్టారు. అయినా ఓ ముఖ్యమంత్రి హోదాలో ఉండి సభలో గుడ్లు మోయడం ఏంటని, ఆయనకు అంటే బుద్దిలేదు. రేవంత్ రెడ్డికి చెప్పాల్సింది పోయి 75 ఏండ్ల జీవన్ రెడ్డి కూడా గుడ్డు మోస్తారా? అని ఎద్దేవా చేశారు. అంతేగాక సభలో అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని, చిల్లర రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ 10 ఏండ్లు రాజకీయం చేసి కుండలు పెట్టి బిందెలు ఎత్తుకొని పోయాడని, రేవంత్ రెడ్డి కుండ లేదు బుట్ట లేదు ఏది లేదని అరవింద్ అన్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version