Medak: EMI కట్టాలని ఫైనాన్స్ కంపెనీ బెదిరించడంతో..బైక్ తగలబెట్టాడు ఓ యువకుడు. ఈ సంఘటన ఇవాళ మెదక్ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా శివంపేటలో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఆగడాలు భరించలేక బైక్ తగలబెట్టాడు ఓ యువకుడు.

ఇంటికి వచ్చి యువకున్ని EMI కట్టాలని బెదిరించాయి ఫైనాన్స్ సంస్థ ఏజెంట్లు. ఈ తరుణంలోనే… మనోవేదనకు గురై ఫైనాన్స్ సంస్థ ఏజెంట్ల ముందే బైక్ కి నిప్పు పెట్టాడు ఆ యువకుడు. దీంతో పూర్తిగా కాలిపోయింది బైక్. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దీనిపై విచారణ చేస్తున్నారు.