హైదరాబాద్ లో దారుణం.. బాలిక పై గ్యాంగ్ రేప్..!

-

తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముఖ్యంగా చిన్నారులపై మహిళలపై రోజురోజుకూ దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చాక్లెట్లు ఇస్తామని నమ్మించి అభం, శుభం తెలియని చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. దేశంలో నిత్యం ఏ మూలన ఏ ఘటన జరుగుతుందో ఎవ్వరు ఊహించలేని పరిస్థితి నెలకొంది. చుట్టుపక్కల వారు, చుట్టాలు, చివరికి కన్న తండ్రి వరుస అన్నవరసాయే వారు కూడా మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మేడిపల్లి లో మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు.

అరుచు గంజాయి సేవించే అలవాటున్న వారు బాలికను ఎత్తుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేడి పెళ్లికి చెందిన ఓ మైనర్ బాలికలను ఇద్దరు వ్యక్తులు మాయ మాటలు చెప్పి స్థానికంగా ఉన్న పాఠశాలకు తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వారు తమ ప్రాంతానికి చెందిన వారేనని బాధితురాలు తల్లిదండ్రులు వెల్లడించారు. అంతేకాదు వారు ఖర్చు గంజాయి సేవిస్తుండే వారని పోలీసులకు తెలిపారు. పోలీసుల రంగంలోకి దిగి వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులతో పాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version