గణేశుడి నిమజ్జనానికి వచ్చిన ఓ చిన్నారి బోరున ఏడ్చిన వీడియో వైరల్ అవుతుంది. హైదరాబాద్ లోని సరూర్నగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద అప్పటివరకు పూజలు అందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికి వెళ్తుండడం చూసి నిమర్జనం చేయొద్దని బాలుడు బోరున విలపించాడు.
పిల్లలకు వినాయకుడు అంటే ఓ ఎమోషన్ అని నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఇన్ని రోజులు ఆటపాటల నడుమ మండపాల వద్ద సందడిగా గడిపిన చిన్నారులు నేటి నుంచి ఇంటికే పరిమితం కానున్నారు.
కాగా, విశాఖ పద్మనాభం మండలం మద్ది లో పోలీసుల సాక్షిగా అశ్లీల నృత్యాలు బయట పడ్డాయి. వినాయక ఊరేగింపు లో నడిరోడ్డుపై అశ్లీల నృత్యాలు చేస్తూ దర్శనం ఇచ్చారు.అసభ్యకర నృత్యాలపై స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పద్మనాభం మండలం మద్ది గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
https://x.com/TeluguScribe/status/1707608967235670421?s=20