రాజలింగమూర్తి హత్య కేసు మిస్టరీ వీడింది. భూవివాదం వల్లే ఈ హత్య జరిగిందని నిర్ధారించారు పోలీసులు. ఈ తరుణంలోనే… ఏడుగురిని అరెస్టు చేయగా.. పరారీలో ముగ్గురు నిందితులు ఉన్నారు. మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టారు ఎస్‌పీ కిరణ్ ఖారే. ఇక A1 రేణికుంట్ల సంజీవ్, A2 పింగిలి సీమంత్, A3 మోరె కుమార్…A4 కొత్తూరి కిరణ్, A5 రేణికుంట్ల కొమురయ్య, A6దాసరి కృష్ణ.. A7 రేణిగుంట్ల సాంబయ్యలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

పరారీలో A8 కొత్త హరిబాబు, A9 పుల్ల నరేష్, A10 పుల్ల సురేష్ ఉన్నారు. నలుగురు కలిసి హత్య చేయగా.. రెక్కీలో పాల్గొన్న ఇద్దరు నిందితులు అని తేల్చారు. ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు ఎస్పీ కిరణ్ ఖారే. ఇక ఈ కేసు పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.