కు.ని ఆపరేషన్లు వికటించి మృతిచెందిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ విచారణ

-

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య, పౌష్టికాహార కేంద్రం ( సివిల్ ఆస్పత్రి) లో జరిగిన కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు వికటించి నలుగురు మహిళల మృతి చెందిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ విచారణ చేపట్టింది. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో వివరాలు సేకరించారు జాతీయ మహిళా కమిషన్ సభ్య కార్యదర్శి కుమారి మీటా రాజీవ్ లోచన్. మృతుల కుటుంబ సభ్యులను అడిగి వివరాలు సేకరించింది జాతీయ మహిళా కమిషన్.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బందిని మొదట విచారణ జరిపింది కమిషన్. అనంతరం ఆపరేషన్ వికటించి మరణించిన ఇబ్రహీంపట్నం మునిసిపాలిటీ సీతారాంపేట్ గ్రామానికి చెందిన లావణ్య కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంది జాతీయ మహిళా కమిషన్. అనంతరం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు బయలుదేరారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిలిపివేస్తూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version