బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బిజెపి మాత్రమే – బండి సంజయ్

-

బిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బిజెపి మాత్రమేనని అన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజా పాలనను గాలికి వదిలేసి సీఎం కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పోలింగ్ బూత్ స్వశక్తికరణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బిఆర్ఎస్, టిడిపి చరిత్ర చూడాలని.. ఏ పార్టీకి పోలింగ్ బూత్ లు, శక్తి కేంద్రాలు లేవన్నారు.

18 రాష్ట్రాలలో సంస్థగతంగా అధికారంలో ఉందన్నారు. ఏ సమస్య వచ్చినా బిజెపి అండగా ఉంటుందనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని తెలిపారు. బిజెపికి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. బిజెపిలో కష్టపడి, ఇష్టపడి పని చేస్తే లక్ష్యాన్ని చేరుకుంటామని సూచించారు. ఈ సమావేశంలో బండి సంజయ్ తో పాటు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version