ములుగు జిల్లాలో మావోయిస్టులు అరాచకం..ఇద్దరిని గొడ్డలితో నరికి !

-

 

ములుగు జిల్లాలో మావోయిస్టులు అరాచకానికి పాల్పడ్డారు. ఇద్దరిని గొడ్డలితో నరికారు. వాజేడు మండలం కేంద్రాల్లో మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఏకంగా ఇద్దరిని గొడ్డలి తో దారుణంగా నరికి చంపారు మావోలు. వాజేడు మండల కేంద్రంలోని పెనుగోలు కాలనీకి చెందిన ఉయిక రమేష్, ఉయిక అర్జున్ లను గొడ్డలితో నరికి చంపారు మావోయిస్టులు. పేరూరు పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్నాడు ఉయిక రమేష్.

Maoists

వాజేడు మండల పోలీస్ స్టేషన్ 250 మీటర్ల దూరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మావోయిస్ట్ ల హిట్ లిస్ట్ లో పంచాయతీ కార్యదర్శి ఉయిక రమేష్ ఉన్నాడట. గతంలో పలు మార్లు పంచాయతీ కార్యదర్శి ఉయిక రమేష్ ను హెచ్చరించిన మావోయిస్టులు..తాజాగా చంపేశారు. మృత దేహాలను ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలం లో లేఖలు విడిచి పెట్టి వెళ్లారు మావోలు. పోలీసులకు రహస్యలు అందించాడని నరికి చంపినట్లు చెబుతున్నారు. ఇక మావోయిస్టుల ఘటనతో ఒక్కసారి గా ఉలిక్కిపడింది ఏజన్సీ.

Read more RELATED
Recommended to you

Latest news