అమ్మ విలువ, అన్నం విలువ అప్పుడే తెలుస్తుంది : కేటీఆర్

-

కేసీఆర్ చేసిన సమీకృత అభివృద్ధితోనే తెలంగాణలో భూములు ధరలు పెరిగాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో 24 గంటల విద్యుత్ ఇవ్వడంతో పాటు పలు సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ ను నమ్మి మోసపోయామని రైతులు బాధపడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయం పడిపోయిందని దుయ్యబట్టారు. అమ్మ విలువ, అన్నం విలువ అవి లేనప్పుడే తెలుస్తుందని పేర్కొన్నారు. 

హైదరాబాద్‌ను ఆటో పైలట్ మోడ్లో పెట్టి ఇచ్చామని మా ప్రత్యర్థులు అంటున్నారు. అది నిజమే అయితే మరి ఈ సంవత్సరంలో ఏమైంది ఇంటింటికి నల్లా పెట్టి మంచి నీళ్లు ఇస్తే అది కూడా ఇయ్యడం చేతనైత లేదు ఈ ప్రభుత్వానికి అన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో చేసిన అభివృద్ధి, సాగునీరు, 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతుభీమా లాంటి పథకాలతో భూముల రేట్లు పెరిగాయి. ఇప్పుడు భూమి ఉంటే రైతుకు భరోసా ఉన్నట్లే. మార్పు మార్పు అన్నారు ఉన్న రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version