కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కేసీఆర్ పూర్వీకుల గ్రామస్తులు మద్దతు ప్రకటించారు. నామినేషన్ వేసేందుకు కోనాపూర్ గ్రామస్తులు డబ్బులు అందజేశారు. కేసీఆర్ ను గద్దె దించేందుకే రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చామని వారు తెలిపారు. కేసీఆర్ పదేళ్లలో ఎప్పుడూ తమ గ్రామానికి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనాపూర్ తన అమ్మమ్మ ఊరు అని నిన్న సీఎం కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సీఎం కేసీఆర్ స్టార్ క్యాంపెయినర్. కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలో దూసుకుపోతున్నారు. రేవంత్ తన ప్రసంగాల్లో బీఆర్ఎస్ పై పదునైన డైలాగ్ లతో పార్టీని ఉర్రూతలూగిస్తున్నారు. మంచి స్పందన రావడంతో పార్టీ మరింత ఉత్సాహంగా కనిపిస్తోంది. కోనాపూర్ లో రేవంత్ రెడ్డి పర్యటించారు. కేసీఆర్ పూర్వీకుల గ్రామం కోనాపూర్ కు వెళ్లారు రేవంత్ రెడ్డి. అక్కడ రేవంత్ రెడ్డిని చూసిన కోనాపూర్ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. పదేళ్లుగా గుర్తుకు రాని కోనాపూర్ ఇవాళ గుర్తుకు వచ్చిందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను గద్దె దించేందుకు రేవంత్ రెడ్డికి గ్రామస్తులందరూ కలిసి నామినేషన్ డబ్బులను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని కోరారు.