రాష్ట్రమంతా సన్నబియ్యం.. హైదరాబాద్‌లో దొడ్డు బియ్యం.. ఎందుకంటే?

-

తెలంగాణలో నేడు రాష్ట్రమంతటా రేషన్ షాపుల్లో సన్న బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రం దొడ్డుబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో హైదరాబాద్‌లో మంగళవారం నుంచి ఇవ్వాల్సిన సన్నబియ్యం పంపిణీకి బ్రేక్ పడింది.

ఖైరతాబాద్ సర్కిల్-7 పరిధిలోని 81 రేషన్ షాపుల పరిధిలో 2,95,779 మంది కార్డుదారులకు తీవ్ర నిరాశే ఎదురైంది. నగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున సన్న బియ్యం పంపిణీ చేయరాదని ఉత్తర్వులు వెలువడ్డాయి.దీంతో సర్కిల్-7 పరిధిలో ఏప్రిల్ నెల కోట కింద దొడ్డు బియ్యాన్ని పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించారు. సన్న బియ్యం బస్తాలను భద్రపరచాలని ఆదేశాలు వచ్చాయి.కాగా, ఏప్రిల్ 29 వరకు కోడ్ అమలులో ఉండగా..వచ్చే నెలలో సన్నబియ్యం పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version