హైదరాబాద్ లో 3.79 లక్షల వీధి కుక్కలు ఉన్నాయట. జీహెచ్‌ఎంసీ పరిధిలో 3.79 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని హైకోర్టుకు నివేదికను ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. వీధి కుక్కల దాడులపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయింది. కుక్కల దాడిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వీధి కుక్కల బారి నుంచి పిల్లలను రక్షించేందుకు.. పరిష్కార మార్గాలను అన్వేషించాలని హై కోర్టు స్పష్టం చేసింది.
వచ్చే వాయిదాకు పరిష్కార మార్గాలతో రావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. GHMC పరిధిలో 3 లక్షల 79 వేల వీధి కుక్కలున్నాయని ఈ సందర్భంగా హైకోర్టుకు తెలిపింది ప్రభుత్వం. రహదారులపై వ్యర్థాల వల్లే కుక్కల స్వైరవిహారం ఎక్కువైందని హై కోర్టు ఫైర్ అయ్యారు. వ్యర్థాలను నిర్మూలించి పరిసరాలను పరి శుభ్రంగా ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది హై కోర్టు.