తెలంగాణలో విద్యుత్ కోతలు లేవు..ఇవాళ్టి నుంచి 24 గంటల కరెంట్ ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు ప్రకటన చేశారు. నిన్న కొన్ని ప్రాంతాల్లో అనివార్య కారణాల వల్ల వ్యవసాయ రంగంకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందని గుర్తు చేశారు.
ఎన్ పి డి సీఎల్ సంస్థలో నిన్న కొంత సమాచార లోపం తో వ్యవసాయ రంగం కు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు. ఇవాల్టి నుండి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ సరఫరా యధావిధిగా ఉంటుందని స్ఫష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండదని తెలిపారు సీఎండీ ప్రభాకర్ రావు. రైతన్నలు ఎవరు ఆందోళన చెందల్సిన అవసరం లేదని తెలిపారు. ఇన్ని రోజులు ఏ విధంగా 24 గంటల విద్యుత్ సరఫరా ఉందో అలానే ఉంటుందని స్పష్టం చేశారు. కరెంట్ కోతలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు సీఎండీ ప్రభాకర్ రావు.