Telangana: మహిళా పంచాయతీ కార్యదర్శి మిస్సింగ్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. మహిళా పంచాయతీ కార్యదర్శి ఆచూకీ లభ్యం అయింది. కాంగ్రెస్ నాయకుల వేధింపులు భరించలేక లేఖ రాసి అదృశ్యమైన ప్రియాంక ఆచూకీని, సిరిసిల్ల పోలీసుల సాయంతో కడప జిల్లాలో కనుక్కున్నారు ఆమె తండ్రి రాజేశం.

ప్రియాంకను వేధించిన కాంగ్రెస్ నాయకులను కఠినంగా శిక్షించాలని వేడుకుంటున్నారు కుటుంబ సభ్యులు. కాగా కాంగ్రెస్ నాయకుల వేధింపుల కారణంగా..మహిళా పంచాయతీ కార్యదర్శి మిస్సింగ్ అయిందని వార్తలు వచ్చాయి. తాము చెప్పిన వారికే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని దూషించారట కాంగ్రెస్ నాయకులు. దింతో “అమ్మా నాన్న నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న, ఈ కాంగ్రెస్ నాయకుల వేధింపులు తట్టుకోలేపకోతున్న” అంటూ లేఖ రాసి అదృశ్యమైంది మహిళా పంచాయతీ కార్యదర్శి ప్రియాంక.