తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ షాక్ తగిలింది. టీజీఆర్టీసీ బస్సుల్లో 50 శాతం పెంచినట్లు సమాచారం అందుతోంది. సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ బస్సులో పెంపు లేదు కానీ టీజీఆర్టీసీ బస్సుల్లో 50 శాతం పెంచిందని అంటున్నారు. సంక్రాంతి స్పెషల్ బస్సుల పేరిట 50 శాతం దోపిడీకి తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సిద్ధం అయిందని అంటున్నారు.
10, 11, 12, 19, 20 తేదీల్లో సంక్రాంతి పండుగకు బస్సుల్లో టికెట్ రేట్లు 50 శాతం పెంచి 6,432 స్పెషల్ బస్సులు నడపనుందట తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ. మరో వైపు సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ఆంధ్రకు వెళ్లే బస్సుల్లో టికెట్ మీద అదనపు చార్జీలు ఉండబోవని ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసీ.. సాధారణ ఛార్జీలు వసూలు చేస్తోంది.