పౌరసరఫరాల శాఖలో భారీ స్కామ్ జరిగింది : కేటీఆర్

-

పౌరసరఫరాల శాఖలో భారీ స్కామ్ జరిగిందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. తాజాగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం అమ్మకాల కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లలో అవకతవకలు జరిగాయి. కాంగ్రెస్  అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే దోపిడికి పాల్పడ్డారు. క్విటాకు 150 నుంచి 223 రూపాయలు అదనంగా చెల్లించాలని రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్లను బెదిరించారు నాలుగు ప్రైవేట్ సంస్థలు బెదిరిస్తున్నాయి.

లిప్ట్ చేయకపోయినా చేసినట్టు మేము చూపిస్తాం. మీరు అదనంగా క్వింటాకు రూ.223 ఇవ్వాలని తెలిపారు. దాదాపు 35 లక్షల మెట్రిక్ టన్నులకు*200 రూపాయలు అంటే దాదాపు రూ.700 కోట్ల వరకు మనిలాండరింగ్ ద్వారా మోసం జరుగుతోంది. కుంభకోణాల కుంభమేళా జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వంతో  సంబంధం లేని ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వం తరుపున డబ్బుల వసూళ్లు ఎలా చేస్తాయని ప్రశ్నించారు. మిల్లర్లతో కుమ్మక్కై భారీ స్కామ్ చేశారు. నాలుగు సంస్థలు కుమ్మక్కై మిల్లర్లను బెదిరిస్తున్నాయని తెలిపారు కేటీఆర్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version