తెలంగాణలో ఉప ఎన్నికలు రావు.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు భయపడకండి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్, రమ్మీ గేమ్స్ , కోడిపందాలు, డ్రగ్స్, గంజాయి వంటి వాటికి తావు లేదని అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటించారు. అభివృద్ధి కోసం చేసే భూసేకరణపై అభ్యంతరం చెప్పకండి అన్నారు. వీలైతే భూమి నష్టపోయిన వారికి ఇవ్వాల్సిన నష్టపరిహారం పై డిబేట్ పెట్టుకుందామని చెప్పారు. ‘

భూమి కోల్పోయిన వారికి తప్పకుండా బాధ ఉంటుంది… ఇక్కడ ఎవరూ వాళ్ల ఇళ్లలో నుంచి నష్టపరిహారం ఇవ్వరు అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించినప్పుడు వాళ్లకు ఒక రూపాయి ఎక్కువ ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంటుందని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.