ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. వర్షాలు, వరదల ముప్పు గంట గంటకు పెరుగుతోంది. దీంతో వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో ప్రభుత్వం, అధికారులు సహాయక చర్యలకు సిద్ధమయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు చోట్ల రోడ్లు, రైలు పట్టాలు చెరువులుగా మారుతున్నాయి.
మరోవైపు మహబూబాబాద్ జిల్లా ఇంటి కన్నె వద్ద రైల్వే ట్రాక్ తెగి పడిపోయింది. ఈ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో భారీగా రైళ్లు రద్దు చేస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే 20 పైగా రైళ్లను రద్దు చేసిన్నట్లు ప్రకటించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. కొన్నింటిని దారి మళ్లించడంతో పాటు మరికొన్నింటిని తాత్కాలికంగా రద్దు చేసింది రైల్వేశాఖ.
రద్దైన రైళ్లు ఇవే..
- విజయవాడ-సికింద్రాబాద్
- సికింద్రాబాద్-విజయవాడ
- గుంటూరు – సికింద్రాబాద్
- సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్
- కాకినాడ ఫోర్ట్ – లింగపల్లి
- గూడూరు- సికింద్రాబాద్,
- భద్రాచలం – బల్లు
- ఇల్లు కాజీ పేట్
- భద్రాచలం – సికింద్రాబాద్
- సికింద్రాబాద్ – భద్రాచలం
- కాజీ పేట – డోర్నకల్
- హైదరాబాద్ – షాలిమర్
- సికింద్రాబాద్ – విశాఖ పట్నం
- విశాఖ పట్నం – సికింద్రాబాద్
- హౌరా – సికింద్రాబాద్
- సికింద్రాబాద్ – తిరువనంతపురం
- తిరువనంతపురం – సికింద్రాబాద్
- మహబూబ్ నగర్ – విశాఖపట్టణం
- లింగంపల్లి – CMT ముంబయి
- కరీంనగర్-తిరుపతి