SLBC కూలిన విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తెలంగాణ ప్రస్తుతం ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటన, సహాయక చర్యలు, కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంపై ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.అయితే, నాలుగు రోజుల కింద పనులు ప్రారంభించిన సమయంలో అక్కడ నీరు ఉందని, ప్రమాదం జరుగుతుందని అధికారులకు ముందే తెలుసని అందులోకి వెళ్లి క్షేమంగా బయటకు వచ్చిన కార్మికుడు ఒకరు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

SLBC టన్నెల్ లో ప్రమాద ఘటనను ముందే గ్రహించిన పని ఆపకుండా చేపించడం వల్లే ఇలా జరిగిందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో నీళ్లు వస్తున్నా పని ఆపలేదు. దీంతో నీటి తాకిడి పెరిగి ఒక్కసారిగా టన్నెల్ క ప్పు కూలిపోయింది. లోపల చిక్కుకు పోయిన మా వారిని ప్రాణాలతో తెచ్చివ్వాలని సదరు కార్మికు డు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. అంతేకాదు.. సొరంగంలో చిక్కుకున్న వారి ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.