ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలిగా అతిషి..!

-

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, మాజీ సీఎం అతిషఇ ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలిగా ఎన్నికయ్యారు. ఆప్ శాసనసభా పక్ష సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలిగా ఒక మహిళా ఎంపిక కావడం ఇదే మొదటిసారి. ఆదివారం ఆప్ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. 22 మంది ఆప్ ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకురాలుగా అతిషి పేరును ఎమ్మెల్యే సంజీవ్ ఝా ప్రతిపాదించారు.

ఢిల్లీ సీఎం రేఖ గుప్తాను ఎదుర్కొవడానికి బలమైన మహిళా నేతగా అతిషిని పేర్కొన్నారు. దీంతో ఆప్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమెను ఎన్నుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలుగా తనను ఎన్నుకోవడం పట్ల అతిషి హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచినందుకు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పార్టీ ఎమ్మెల్యేకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. బలమైన ప్రతిపక్షం ప్రజల గొంతును లేవనెత్తుతుంది. బీజేపీ ఇచ్చిన అన్ని వాగ్దానాలు నెరవేర్చేలా ఆప్ ప్రయత్నిస్తుంది అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news