తెలంగాణలో ఎప్పటి నుంచో ఓ డిమాండ్ ఉంది. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి కరోనా ట్రీట్‌మెంట్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని పెద్ద ఎత్తున ప్రజలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. కానీ వాటిపై ఎప్పుడూ స్పందించని ప్రభుత్వం నిన్న సెన్సేషనల్ నిర్ణయం తీసకుంది.
రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. దీనికి కారణం ప్రజల నుంచి, పలు సంఘాల నుంచి తీవ్ర విమర్శలు రావడమే. అయితే ఆరోగ్యశ్రీలో మాత్రం చేర్చలేదు. ఎందుకంటే ఇప్పటికే ఆరోగ్యశ్రీ బిల్లులు ఎన్నో పెండింగ్‌లో ఉన్నాయి.
కొత్తగా కరోనా ట్రీట్‌మెంట్‌ను అందులో చేర్చితే వేల మందికి బిల్లులు పేమెంట్ చేయాలి. ప్రభుత్వంపై ఇది పెద్ద భారం. కాబట్టి ముందే తాము ప్రయివేటు ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ ధరలపై జీవో ఇచ్చామని, కాబట్టి ఇప్పుడు కొత్తగా ఆరోగ్యశ్రీలో చేర్చలేమని స్ప