కాంగ్రెస్ లో కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుంది : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

తెలంగాణలో రెండు ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఇవాళ నామినేషన్ వేసేందుకు చివరి రోజు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు.  నామినేషన్ దాఖలు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీలో కష్టపడి పని చేసిన వారికి తగిన గుర్తింపు దక్కుతుందని చెప్పారు. అందుకే మహేష్ గౌడ్, బల్మూరి వెంకట్ కి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం రావడమే ఉదాహరణ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయని భావిస్తున్నట్టు చెప్పారు. సర్పంచ్ ల బిల్లులను ఆపిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని.. ఇప్పుడు వారి తరపున పోరాడుతామని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version