ఇది గొల్ల కురుమ జాతికి జరిగిన అవమానం అని ఆవేదన వ్యక్తం చేశారు వేములవాడ బీజేపీ నేత తుల ఉమ. బిజెపికి రాజీనామా చేసిన వేములవాడ నేత తుల ఉమ ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘చివరి నిమిషంలో బీఫామ్ వేరే వాళ్ళకి ఇచ్చి నన్ను అవమానించారు.
ఇది నా ఒక్కదానికి జరిగిన అవమానం కాదు, నా గొల్ల కురుమ జాతికి జరిగిన అవమానం. బీజేపీలో కమిట్మెంట్ ఉన్న కార్యకర్తల ఉత్సాహాన్ని మీ తప్పుడు నిర్ణయాలతో నీరు కారుస్తున్నారు. బీఫామ్ లే సరిగ్గా ఇవ్వలేని మీరు బీసీ నినాదంతో ముందుకుపోతా అనడం విడ్డూరంగా ఉంది’ అని ఫైర్ అయ్యారు తుల ఉమ.
ఇక తుల ఉమ సొంత గూటికి వెళ్లనున్నారు. వేములవాడ బీజేపీ నేత తుల ఉమ నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. బీజేపీకి తుల ఉమ రాజీనామా చేశారు. బిజెపి నేత తుల ఉమా సొంతగూటికి చేరనున్నారు. దీంతో నాలుగు రోజులుగా సాగుతున్న హైడ్రామాకు తెలపడింది.