శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గాలా..? ఉదయం లేవగానే ఈ పనులు చేయండి

-

రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అనేక అర్థాలు వస్తాయి. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ కారణంగా హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు అధికమవుతున్నాయి. ప్రస్తుతం కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం.

ముఖ్యంగా ఉదయం చేసే కొన్ని పనుల వల్ల రక్తంలోని కొలెస్ట్రాల్ ని తగ్గించవచ్చు.

ఖాళీ కడుపుతో నీళ్లు:

ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో నీళ్లు తాగటం వల్ల మంచి లాభాలు ఉన్నాయి. ఒక గ్లాసు నీళ్లలో ఒక నిమ్మ కాయను పిండుకుని తాగితే మరింత బాగుంటుంది. నిమ్మరసంలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, వీటివల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

బ్రేక్ ఫాస్ట్ లోని ఆహారాలు:

అరటిపండు, ఆపిల్, ఓట్స్ వంటి వాటిని బ్రేక్ ఫాస్ట్ లో భాగం చేసుకోవాలి. ఎందుకంటే వీటిల్లో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ కారణంగా రక్తనాళాల్లోని చెడు కొవ్వు నశిస్తుంది. అంతేకాదు.. రెండు మూడు బాదాం గింజలు, వాల్నట్స్ తీసుకోవడం కూడా మంచిది.

వ్యాయామం ముఖ్యం:

రోజుకు కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం మంచి పద్ధతి. 20 నిమిషాల పాటు వేగంగా నడవడం వల్ల కొవ్వు తగ్గిపోయే అవకాశం ఉంది. అంతేకాదు యోగా కూడా బాగా హెల్ప్ చేస్తుంది.

చక్కెర కలిగిన ఆహారాలు ముట్టుకోవద్దు:

రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే చక్కెర కలిగిన ఆహారాలు అయినా కేక్స్, కూల్ డ్రింక్స్ వంటి వాటిని ముట్టుకోకపోవడం ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Exit mobile version