తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాలు అసలు ఎందుకని ఆయన మండిపడ్డారు. రేషన్ బియ్యం అమ్ముకునే వాళ్లకు… సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వాలని ఆయన ఫైర్ అయ్యారు.
ఉచితాలు తగ్గించాలి… రేషన్ కార్డులలో కోతలు పెట్టాలంటూ బాంబు పేల్చారు. ఇంత సంఖ్యలో రేషన్ కార్డులు ఇవ్వాలంటే ఎలా అని ప్రశ్నించారు. తెలంగాణలో 1 కోటి కుటుంబాలు ఉంటే, 1 కోటి 25 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి.. అంటే తెలంగాణలో అందరూ పేదలేనా? అని పేర్కొన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఐతే ఉచిత పథకాలు అసలు ఎందుకని ఆయన మాట్లాడటం పైన జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కౌలు రైతులకు రైతుభరోసా ఇవ్వాలంటే భూ యజమానులతో గొడవలు అవుతున్నాయన్నారు. భూయాజమానులకు కౌలు రైతులకు మధ్య సఖ్యత ఉండటం లేదని బాంబు పేల్చారు. కౌలు రైతులకు రైతుభరోసా ఎలా ఇవ్వాలో సూచనలు ఇవ్వండి అని కోరారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు.