ఖమ్మం జిల్లా రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ తుమ్మల నాగేశ్వరరావు ఉద్దేశించి అన్న మాటలపై తుమ్మల స్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో జెండా కట్టే దిక్కు లేక మూడు నెలలు నన్ను బతిమిలాడితే బీఆర్ఎస్ పార్టీలో (అప్పటి టీఆర్ఎస్)లో చేరానని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మూలన కూసున్న తనను పిలిచి మంత్రి పదవి ఇచ్చానని కేసీఆర్ చెప్పటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
‘నన్ను బతిలాడితే ఏమీ లేని టిఆర్ఎస్ కి జడ్పిటిసి లను ఎంపీటీసీలను సర్పంచ్లను తీసుకొచ్చి పార్టీ నిర్మాణం చేశాను. పువ్వాడ అజయ్ వయ్యారి భామ పువ్వు లాంటి వారు. ఆ పూవు పూజకు పనికిరాదు. తుమ్మల నాగేశ్వర రావు.. తుమ్మ లాంటి వారే. ఆ చెట్టు చావతో నాగలి చేసి వ్యవసాయానికి ఉపయోగపడి అందరికీ అన్నం పెడుతుంది.’ అని తుమ్మల నాగేశ్వర రావు కేసీఆర్కు కౌంటర్ ఇచ్చారు. ఖమ్మంలో అజయ్ పని అయిపోయిందని సభకు ఎవరు రాకపోతే ఇతర మండలాల నుంచి 300 ఇచ్చి మనిషికి తీసుకువచ్చారని తుమ్మల ఎద్దేవా చేశారు.