కోదాడ మండలం, కాపుగల్లులో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు రాలేదని రైతులు అడుక్కుంటున్నారు అంటూ మంత్రి తుమ్మల హాట్‌కామెంట్స్ చేశారు. అయితే.. తుమ్మల వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. రైతే రాజు నినాదం కాదు…కేసీఆర్ ప్రభుత్వ విధానం అన్నారు. అడగకుండానే రైతుబంధు… అడగకుండానే రైతుబీమా….అడగకుండానే సాగునీళ్లు ఇచ్చామని తెలిపారు.
అడగకుండానే ఉచితంగా 24 గంటల కరెంటు…అడగకుండానే 100 శాతం పంటల కొనుగోళ్లు చేస్తామన్నారు. వ్యవసాయం దండగ కాదు పండగ అని చాటిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదంటూ తుమ్మలకు కౌంటర్ ఇచ్చారు. రైతులు ఎప్పుడూ .. ఆశపడతారు తప్ప అడుక్కోరు… సమయం రాక పోదు…మీకు గుణపాఠం చెప్పక పోరు అన్నారు కేటీఆర్. కరోనా విపత్తులోనూ కర్షకులకు బాసటగా నిలిచిన చరిత్ర కేసీఆర్ గారిది…ప్రతి ఊరికీ వెళ్లి పంటలు కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్ గారిది అని వెల్లడించారు. రైతుబంధును రాజకీయం చేసి… రైతుభరోసా అంటూ భ్రమలు కల్పించారని కాంగ్రెస్ పై ఆగ్రహించారు.