Telangana: ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు నేడే లాస్ట్

-

 

తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌. తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు నేటితో ముగియనుంది. రూ. 1000 ఆలస్య రుసుముతో ఆన్లైన్ లో ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా తెలిపారు. ఈనెల 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు.

Today is the last date for payment of inter supplementary fee

కాగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం TG విద్యాసంస్థల్లో AP విద్యార్థులకు పదేళ్లపాటు సీట్లు కల్పించే గడువు ఈ ఏడాది జూన్ 29తో ముగియనుంది. దీంతో 2025-26 విద్యా సంవత్సరం నుంచి AP కోటాకు (15%)బ్రేక్ పడనుంది. సీట్లన్నీ TG విద్యార్థులకి ఇవ్వనున్నారు. ఈ ఏడాది నోటిఫికేషన్లు అన్ని జూన్ కు ముందే రావడంతో కామన్ అడ్మిషన్లకు ఛాన్స్ ఉంది. ఈసారి TS EAPCET సహా పలు ప్రవేశ పరీక్షలకు AP స్టూడెంట్స్ నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version