హుజూరాబాద్ ఉపఎన్నిక హీట్.. మధ్యాహ్నం కేబినెట్ కీలక భేటీ

-

హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ కానుంది. హుజూరాబాద్ ఉపఎన్నికతో పాటు పలు కీలక అంశాలపైనా చర్చించనున్నారు. ప్రధానంగా దళిత బంధు మార్గదర్శకాలు, ఉద్యోగ ఖాళీల భర్తీ వంటి అంశాలపైనా చర్చిస్తారని సమాచారం. ఈ అంశాలతో పాటు చేనేత బీమా, వ్యవసాయం, పోడు భూములు, సాగునీటి పారుదల రంగంపైనా  ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

 

ఇక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విషయం తెలిసిందే. ఈ అంశాలపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. కృష్ణా జలాల వాటాలకు సంబంధించి కొత్త ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు నీటి విడుదలను వ్యతిరేకించాలని ఇప్పటికే కృష్ణా రివర్ బోర్డుకు లేఖ తెలంగాణ ప్రభుత్వం రాసింది. ఈ అంశాలన్నింటిపైనా సమగ్రంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ భేటీకి సంబంధించి ప్రగతి భవన్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version