ఇవాళ 4 నియోజక వర్గాల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఒకవైపు తన నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటూ…. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు టిపిసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి. రోజుకి మూడు నియోజకవర్గాలకు తగ్గకుండా చేస్తున్న ప్రచారంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరుగుతోంది.

రోజు మాదిరిగానే ఇవాళ నాలుగు నియోజకవర్గాల్లో రేవంత్ పర్యటించనున్నారు. నర్సాపూర్, పరకాల, ఖైరతాబాద్, నాంపల్లిలలో రేవంత్ బహిరంగసభల్లో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నర్సాపూర్ లో, 3 గంటలకు పరకాలలో, 6 గంటలకు ఖైరతాబాద్ లో, 8 గంటలకు నాంపల్లిలో రోడ్ షోలో సభల్లో పాల్గొననున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
- నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి
 - నర్సాపూర్, పరకాల ఖైరతాబాద్, నాంపల్లి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి
 - మధ్యాహ్నం 12 గంటలకు నర్సాపూర్ బహిరంగసభ
 - మధ్యాహ్నం 3 గంటలకు పరకాల బహిరంగసభ
 - సాయంత్రం 6 గబటలకు ఖైరతాబాద్ రోడ్ షో
 - రాత్రి 8 గంటలకు నాంపల్లి రోడ్ షోలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి.
 
