పార్టీ లైన్ దాటితే ఊరుకోం..తీన్మార్ మల్లన్న ఎపిసోడ్ పై TPCC మహేష్ కుమార్ రియాక్ట్ అయ్యారు. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని… మల్లన్నను ఎన్నో సార్లు హెచ్చరించామని గుర్తు చేశారు. బీసీ కుల గణన ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ అయిందని… మల్లన్న చేసిన వాఖ్యలు చాల తప్పు అన్నారు.
పార్టీ లైన్ దాటితే ఎవరినీ వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు TPCC మహేష్ కుమార్. ఇది ఇలా ఉండగా… కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నకు ఊహించని షాక్ తగిలింది. ఆయనపై వేటు వేసింది కాంగ్రెస్ పార్టీ. కాసేపటి క్రితమే..తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తరుణంలోనే… తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ ఛార్జిగా మీనాక్షి నటరాజన్ తాజాగా నియామకం కాగానే.. తీన్మార్ మల్లన్నపై వేటు పడింది.