కేసీఆర్ పాటకు విద్యార్థుల డ్యాన్సులు.. సిబ్బందిపై విద్యాశాఖ చర్యలు?

-

సూర్యాపేట జిల్లాలో విద్యార్థులు కేసీఆర్ పాటకు స్టెప్పులేయడం ప్రస్తుతం రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ రెసిడెన్షియల్ గురుకుల బాలుర కళాశాలలో శుక్రవారం ఫేర్‌వెల్ వేడుక జరిగింది.

ఈ పార్టీ కార్యక్రమంలో కేసీఆర్ పాట పెట్టుకుని విద్యార్థులు స్టెప్పులేశారు.విద్యార్థులు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ విషయంపై విద్యాశాఖ అధికారులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కళాశాల సిబ్బందిని సస్పెండ్ చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news