హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది.పెళ్లైన నెల రోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. పెళ్లయిన నెల రోజులకే ఇంట్లో ఉరివేసుకొని చనిపోయింది గంట విజయ గౌరీ(20). బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న యువతికి….ఇటీవలే పెళ్లి చేశారు.

గత నెల ఫిబ్రవరి 6న ఈశ్వర రావు తో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న గంట విజయ గౌరీ(20) వివాహం జరిగింది. ఈ తరునంలోనే.. పెళ్లయిన నెల రోజులకే ఇంట్లో ఉరివేసుకొని చనిపోయింది మృతురాలు స్వస్థలం విజయనగరం జిల్లాగా గుర్తించారు పోలీసులు. నిన్న రాత్రి బాల్ రెడ్డి నగర్ లో ఈ ఘటన జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేయడం తోనే ఆత్మహత్య కు పాల్పడినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.