హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కేసీఆర్ చాలా బలంగా కోరుకుంటున్నారు. ఇందుకోసం సర్వ శక్తులను ఖర్చు చేస్తున్నారు. గత చరిత్రలో ఎన్నడూ లేనంతగా కేవలం ఒక్క ఉప ఎన్నిక కోసమే కొత్త స్కీములు కూడా పెడుతున్నారంటే ఈ ఎన్నికలను కేసీఆర్ ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే అన్ని పార్టీలకు అక్కడ బలంగా ఉంటున్న నేతలపై కూడా బాగానే ఫోకస్ పెట్టారు.
ఇందులో భాగంగా ఆయా పార్టీల్లోని కీలక నేతలను తన పార్టీలోకి లాగేసుకుంటున్నారు కేసీఆర్. హరీశ్ రావును ఇన్ చార్జిగా నియమించి కేసీఆర్ అన్ని వ్యూహాలను తానే ప్లాన్ చేస్తూ దగ్గరుండి చూసుకుంటున్నారు. కేసీఆర్‌కు ఉద్యమ కాలంలో దగ్గరయిన నేతలను ఆయా పార్టీల్లో ఉన్నప్పటికీ వారిని తన పార్టీలోకి రప్పించేందుకు ప్లాన్ వేస్తున్నారు.
ఇక ఇందులో భాగంగానే కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికవుతాడని అనుకున్న కౌశిక్ రెడ్డిని ఎంతో ప్లాన్ వేసి మరీ గులాబా బాస్ తమ గూటికి రప్పించుకున్నారు. ఈ దెబ్బతో అసలు కాంగ్రెస్‌కు అభ్యర్థి దొరకడమే కష్టంగా మారింది. ఇక ఇప్పుడు బీజేపీ నుంచి కూడా కీలకంగా ఉంటున్న మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ఆ పార్టీలో అసంతృప్తిగా ఉండటంతో ఆయన్ను కూడా ప్లాన్ వేసి మరీ రాజీనామా చేయించినట్టు తెలుస్తోంది. ఇక తవ్రలోనే ఆయన్ను టీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు గులాబీ దళపతి ప్లాన్ వేశారు. ఇలా ఒక్కక్కరినీ లాగేసుకుంటూ హుజూరాబాద్ లో టీఆర్ఎస్ బలాన్ని అమాంతం పెంచేస్తున్నారు కేసీఆర్.