వామపక్ష నేతలతో టీఆర్​ఎస్ నాయకుల భేటీ

-

వామపక్షాల మద్దతుతో ఇటీవల టీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పార్టీలు ఆ దిశగా ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్​లోనూ ఈ పొత్తు కొనసాగేలా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా వామపక్షాల నేతలతో టీఆర్ఎస్ నాయకుల భేటీ ఈ ఊహాగానాలకు మరింత ఊతమిస్తున్నాయి.

అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్.. సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. మగ్ధుం భవన్​లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్​ రెడ్డితో భేటీ అయ్యారు. మునుగోడు ఉపఎన్నిక విజయం తర్వాత సీపీఐ కార్యాలయానికి టీఆర్​ఎస్ నేతలు రావటంపై ప్రాధాన్యత నెలకొంది.

ఈ నెల 12న రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తుండగా విభజన సమస్యలపై నిరసన వ్యక్తం చేయాలని వామపక్ష నేతలు నిర్ణయించారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నాయకులు సీపీఐ నేతలతో భేటీ కావడం చర్చనీయంగా మారింది. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లాలనే టీఆర్ఎస్ నేతలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version