మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. మునుగోడు ఉప ఎన్నికలలో విజయం సాధించి భవిష్యత్తులో ఎన్నికలకు పట్టు సాధించాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీకి ఈ ఉపఎన్నిక అత్యంత కీలకంగా మారింది. వచ్చే ఎన్నికలకు ముందు జరగనున్న ఈ ఉపఎన్నిక పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ మునుగోడు ఉపఎన్నికపై ఫోకస్ పెట్టారు.
మునుగోడు ఉప ఎన్నిక బరిలో టిఆర్ఎస్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని దించుతారు అన్న ప్రచారం పార్టీ శ్రేణుల్లో జోరందుకుంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దాదాపు ఖరారు అయినట్టు సమాచారం. శనివారం మునుగోడు లో జరిగే సభలో కేసీఆర్ కూసుకుంట్ల పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో రేపు మునుగోడు మండల కేంద్రంలో జరగనున్న బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్ను టిఆర్ఎస్ శుక్రవారం ఆవిష్కరించింది. ఈ సభకు ప్రజా దీవెన సభ అనే పేరు పెట్టింది. రేపు మధ్యాహ్నం రెండు గంటలకు జరగనున్న ఈ సభలో మునుగోడు ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.
రేపు మునుగోడులో జరిగే "ప్రజా దీవెన సభ"లో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న సీఎం శ్రీ కేసీఆర్. #MunugodeWthTRS pic.twitter.com/2F15ZhBIa8
— TRS Party (@trspartyonline) August 19, 2022