సత్యం, న్యాయమే గెలుస్తుంది : కేటీఆర్

-

ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సాహించాలన్న ఫార్ములా- ఈ కారు రేసు ఉద్దేశం చిల్లర రాజకీయాలు చేసే వారికి తెలియదన్నారు. ఎప్పటికైనా సత్యం, న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏసీబీ ఆఫీస్ కి బయలుదేరే ముందు ట్విట్టర్ వేదిక గా ఓ వీడియో పోస్ట్  చేశారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ ను భారత్ కు తీసుకొచ్చేందుకు కృషి చేసినట్టు తెలిపారు. 

తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు ప్రయత్నించానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.మా ప్రభుత్వం ఉన్నపుడు మా బావమరుదులకు రూ.1137 కోట్ల కాంట్రాక్ట్ కోసం పని చేయలేదు. మంత్రిగా నేను క్యాబినెట్లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్టులు ఇచ్చుకోలేదు. ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. నేను రూ.50 లక్షలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కాదు. నేను నికార్సైన తెలంగాణ బిడ్డను.. నేను ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి చేశాను. అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version