ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ బంజారాహిల్స్ లోని నందినగర్ నివాసం నుంచి ఏసీబీ విచారణకు బయలుదేరారు. కేటీఆర్ లాయర్, మాజీ ఏఏజీ రామచందర్ రావు ఆయనతో పాటు వెళ్లారు. విచారణ జరిగే సమయంలో గది పక్కనే ఉన్న లైబ్రరీ రూమ్ వరకు లాయర్ ను అనుమతించనున్నారు. కేటీఆర్ విచారణ దృష్ట్యా అప్రమత్తమైన పోలీసులు ఏసీబీ ఆఫీస్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఐఏఎస్ దానకిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇవాళ కేటీఆర్ ను విచారించనున్నారు.
కేటీఆర్ ను కేవలం ప్రశ్నిస్తారా..? లేక ఇంకా ఏమైనా చేస్తారా..? అనే ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్ తన నివాసం నుంచి బయలుదేరే సమయంలో మీడియాతో మాట్లాడారు. న్యాయ వ్యవస్థ పై మాకు నమ్మకం ఉంది. ఎలాంటి అవినీతి చేయలేదు. తెలంగాణ ప్రతిష్ట పెంచడానికే తాను ప్రయత్నించాను. తనపై ఇంకా ఎన్ని కేసులు అయినా పెట్టుకో.. వాటిని ఎదుర్కొంటాను. అరపైసా అవినీతికి పాల్పడలేదని మీడియాకు తెలిపారు.