దసరా తరువాత…గ్రూప్‌-4 జనరల్‌ ర్యాంకు మెరిట్‌ జాబితా

-

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షలు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున వాయిదా పడ్డాయి. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల ఫలితాలు కూడా ఇంకా పెండింగ్​లోనే ఉన్నాయి. అయితే తాజాగా టీఎస్పీఎస్సీ ఓ వార్త చెప్పింది. రాష్ట్రంలో 8,180 గ్రూప్‌-4 సర్వీసుల పోస్టుల జనరల్‌ ర్యాంకు మెరిట్‌ జాబితాను వెలువరించేందుకు సిద్ధమైనట్లు తెలిపింది. దసరా తర్వాత ఈ పరీక్షలకు సంబంధించి జనరల్ ర్యాంకు మెరిట్ జాబితా వెల్లడించే యోచనలో ఉంది.

జులై 1న గ్రూప్‌-4 రాతపరీక్ష నిర్వహించగా రాష్ట్రవ్యాప్తంగా 7.6 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి తుది కీ విడుదల చేసిన కమిషన్‌ పేపర్‌-1లో ఏడు ప్రశ్నలు, పేపర్‌-2లో మూడు కలిపి మొత్తం పది ప్రశ్నలు తొలగించింది. రెండు పేపర్లలో మొత్తం 13 ప్రశ్నల సమాధానాల్లో మార్పులు చేయగా, ఇందులో అయిదింటికి ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలను సరైనవని తెలిపింది. తుది కీ వెల్లడి కావడంతో అభ్యర్థుల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేసి.. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జనరల్‌ ర్యాంకు మెరిట్‌ జాబితా విడుదల చేయాలని కమిషన్‌ భావిస్తోంది. దసరా పండగ తరువాత మెరిట్‌ జాబితా ఇవ్వాలని కమిషన్‌ భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news