బస్సులతో ఆటలాడితే సహించేది లేదు : ఎండీ సజ్జనార్‌

-

తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఆర్టీసీలో ప్రక్షాళనకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అంతే కాకుండా ఆర్టీసీని ఎలాగైనా లాభాల బాట పట్టించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆర్టీసీ ఖజానా పెంచడమే గాక.. దాని వల్ల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేస్తున్నారు. ప్రయాణికులపై భారం పడకుండా అప్పుడప్పుడు ఆఫర్లు ప్రకటిస్తూ వారిని ఆకర్షిస్తున్నారు. అయితే కొన్నిసార్లు అధికారుల నిర్లక్ష్యం.. ప్రయాణికుల అలసత్వం తన దృష్టికి వస్తే వెంటనే స్పందిస్తున్నారు.

తాజాగా ఇలాంటి ఘటనే సజ్జనార్ దృష్టికి వచ్చింది. ద్విచక్రవాహనంపై వెళ్తూ టీఎస్‌ఆర్టీసీ బస్సును వెనుక నుంచి కాలుతో నెడుతున్నట్లుగా ఓ యువకుడు తీసుకున్న వీడియో ఘటనపై సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో పాపులారిటీ కోసం రహదారులపై ఇలాంటివి చేేయవద్దని హెచ్చరించారు. మిధానీ డిపోనకు చెందిన బస్సు 104-ఎ రూట్లో వెళుతుండగా ఓ యువకుడు ద్విచక్రవాహనం నడుపుతూ ఒక కాలుతో బస్సు వెనుకభాగాన్ని నెడుతున్నట్లున్న వీడియో వైరల్‌ అయింది. ఈ వీడియోను సజ్జనార్‌ ట్వీట్‌ చేస్తూ.. ప్రమాదాల బారిన పడి మీ తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చవద్దని సూచించారు. ఇలాంటి వారిపై చట్టప్రకారం సంస్థ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version