తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త చెప్పింది. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబును కలిసారు టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు. ఇకపై తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు వారానికి నాలుగు సిఫార్సు లేఖలకు ఏపీ సీఎం అంగీకారం తెలిపారు. వారానికి రెండు రూ.300 వందల రూపాయల దర్శనానికి సిఫార్సు లేఖలు, రెండు బ్రేక్ దర్శనం లేఖలకు ఏపీ సీఎం అనుమతి ఇచ్చారు.
వాస్తవానికి 2019 కి మందు అన్ని ప్రాంతాల వారి లేఖలను పరిగణలోకి తీసుకొని దర్శనాలకు అనుమతి ఇచ్చేవారు. కానీ 2019 తరువాత వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో 2024 వరకు తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధుల లేఖలను అనుమతించలేదు. తిరుమలలో తెలంగాణ ప్రాంతం పై వివక్ష చూపడం సరికాదని.. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మండిపడ్డారు. దీంతో నూతన టీటీడీ ఛైర్మన్ బీఆర్ కే నాయుడు తెలంగాణ ప్రజా ప్రతినిధుల అసహనం పై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.