మల్కాజ్ గిరి మహిళా మర్డర్ కేసులో ట్విస్ట్..నిందితుడు ఎవరంటే…

-

మల్కాజ్గిరి లో ఈనెల 18న గుడికి వెళ్లి అదృశ్యమైన ఉమాదేవి అనే మహిళ కథ విషాదాంతంగా మారిన విషయం తెలిసిందే.ఈ కేసును విచారించిన పోలీసులు హత్య చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకొని షాక్ అయ్యారు.గుడికి వెళ్ళిన ఉమాదేవి నగలపై కన్నువేసిన పూజారే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు( పూజారి) మురళిని మల్కాజ్గిరి ఎన్ ఓ టి పోలీసులుు పట్టుకున్నారు. కాగా మల్కాజ్ గిరి , విష్ణుపురి ఎక్స్టెన్షన్ కాలనీలో ఈనెల 18న అదృశ్యమైన ఉమాదేవి (57) మృతదేహం గురువారం కాలనీలోని స్వయంభు శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం వెనుక కనిపించింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

అదృశ్యమైన రోజునే ఉమాదేవిని హతమార్చి ఆమె ఒంటిపై ఉన్న సుమారు 10 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు.ఉమా దేవి భర్త జి వి ఎస్ మూర్తి రైల్వేలో ఉద్యోగం చేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు.వీరికి ఇద్దరు పిల్లలు, కుమారుడు ఆస్ట్రేలియాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.కుమార్తె వివాహం గత నెల 27న జరిపించారు.ఉమాదేవి రోజు ఇంటి దగ్గర లోని వినాయక స్వామి ఆలయానికి, విష్ణుపురి లోని శివాలయానికి వెళుతుంది.ఈనెల 18న ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.గురువారం రోజున ఆలయం వెనుక ఆమె మృతదేహం లభ్యమైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version