ఓయో రూములో యువతి మృతి కేసులో ట్విస్ట్..హత్య చేసి మరీ !

-

ఓయో రూములో యువతి మృతి కేసులో ట్విస్ట్ చేసుకుంది. స్నేహితులతో హోటల్లో పార్టీ చేసుకోవడానికి వెళ్ళి, ఉదయం డోరు తెరిచే సరికి ఫ్యానుకు ఉరివేసుకొని కనిపించింది యువతి. నల్గొండ జిల్లాకు చెందిన అనూష(26) అనే యువతి భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకొని తల్లిదండ్రుల వద్దే ఉంటూ బ్యూటీషియన్‌గా పని చేస్తుంది.

oyo
oyo

ఈ నెల 22వ తేదీన స్నేహితుల ఇంటికి వెళ్లొస్తానని చెప్పిన అనూష తిరిగి రాకపోవడంతో, పోలీసులకు ఫిర్యాదు చేశారు అనూష తల్లిదండ్రులు. హైదరాబాద్–రాయదుర్గంలోని క్యూబా ఓయోలో యువతి ఆత్మహత్య చేసుకుందని సమాచారం అందడంతో, ఘటనా స్థలానికి చేరుకొని చనిపోయిన యువతిని అనూషగా నిర్ధారించారు పోలీసులు. అనుషను హత్య చేసి ఆత్మహత్య లాగా చిత్రీకరిస్తున్నారని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news