చిన్నారి హత్యకేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన హత్య కేసులో, చిన్నారి హితాక్షిని హత్య చేసింది ఆమె పిన్ని మమతగా నిర్ధారించారు పోలీసులు. తోటికోడలి పెత్తనం తట్టుకోలేకే చిన్నారిని తన పిన్ని హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆకుల రాము-నవీన దంపతుల కుమార్తె హితిక్ష. అయితే ఎప్పటి మాదిరిగా శనివారం పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి ఆరుబయట తోటి పిల్లలతో కలిసి ఆడుకుంది హితిక్ష.

ఆ సమయంలో షాపింగ్ నిమిత్తం బయటికి వెళ్ళింది చిన్నారి తల్లి నవీన. ఇదే అదనుగా హితిక్షను చంపడానికి ప్లాన్ వేసినట్లు సమాచారం అందుతోంది. ఒక కత్తి, ఒక కట్టర్ ఉపయోగించి హితిక్ష గొంతుపై విచక్షణారహితంగా పొడిచి చంపినట్టు గుర్తించారు పోలీసులు. అనుమానం వచ్చిన పోలీసులు.. చివరికి సీసీ ఫుటేజ్ పరిశీలించగా, ఆ సమయంలో పాప పిన్ని ఇంటికి వచ్చినట్లు గుర్తించారు.
ప్రస్తుతం పిన్ని మమతను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.