కలుషిత నీళ్లు తాగి ఇద్దరు మృతి.. 30 మందికి అనారోగ్యం

-

కలుషిత నీళ్లు సేవించి ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. మరో 30 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలోని స్థానిక సంజీవరావుపేటలో మూడు రోజులుగా మిషన్ భగీరథ రావడం లేదు. దీంతో గ్రామస్తులు చేసేది ఏమీ లేక ఓ బావిలోని నీళ్లు తోడుకుని వాటినే తాగుతున్నారు.

అవి కాస్త కలుషిత కావడంతో ఆ నీటిని తాగిన వారిలో ఇప్పటికే ఇద్దరు మరణించగా.. మరో 30 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యం పాలైన వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.సమాచారం తెలుసుకున్న అధికారులు బావిలోని నీటి శాంపిల్స్ సేకరించి టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపించినట్లు వెల్లడించారు. గత కొంతకాలంగా ఆ బావి నిరూపయోగంగా మారడంతో పాటు చెత్త, మురికి చేరి అధ్వాన్నంగా మారిందని గ్రామస్తులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version