ఖబడ్దార్.. హర్యానా ముఖ్యమంత్రిని చంపేస్తాం!

-

హర్యానా ఎన్నికలు ఈనెల 5వ తేదీన జరగగా.. 8వ తేదీన ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ యువకుడు ‘ఖబడ్దార్.. హర్యానా సీఎంను చంపేస్తాం’ అని బెదిరించాడు. ఎన్నికల టైంలో పలు వాట్సాప్‌ గ్రూపుల్లో ఈ మెసేజ్ బాగా వైరల్ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ విధంగా బెదిరింపులకు పాల్పడిన అజ్మీర్‌ అనే యువకుడిని అరెస్ట్ చేశారు.

జింద్ జిల్లా పోలీసు అధికారి సుమిత్ కుమార్ కథనం ప్రకారం.. అక్టోబర్ 8న హర్యానాలో ఓట్ల లెక్కింపు జరిగే సమయంలో జులానాకు చెందిన అజ్మీర్ అనే యువకుడు ఓ వాట్సాప్ గ్రూపులో రాష్ట్ర ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీని చంపేస్తానని బెదిరించాడు. ఆ మెసేజే గ్రూపుల్లో వెంటనే వైరల్ అయ్యింది. విషయం తెలియగానే వెంటనే అతన్ని అరెస్టు చేశాం. దర్యాప్తు కొనసాగుతోందని ఆ పోలీసు అధికారి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version