తెలంగాణ ప్రజలకు అలర్ట్. నేడు ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం జరుగనుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు రంగం భవిష్యవాణి కార్యక్రమం ఉంటుంది. పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి చెప్పనున్నారు మాతంగి స్వర్ణలత. రంగం అనంతరం అమ్మవారి అంబారి ఊరేగింపు, సాయంత్రం ఫలహార బండ్ల ఊరేగింపు ఉంటుంది.

రంగం కార్యక్రమంలో పాల్గొననున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇది ఇలా ఉండగా ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. శివసత్తులతో వచ్చిన మైనర్ యువకుడిని చితకబాదారు పోలీసులు. భక్తుల రద్దీ పెరగడంతో లోపలకి వెళ్లే ప్రయత్నం చేశారు శివసత్తులు. ఇక శివసత్తులతో వచ్చిన యువకుడిని బయటకు లాగి చేయి చేసుకున్నారు పోలీసులు.